కేరళలోని వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ప్రియాంక నామినేషన్ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. టూరిస్టు ప్రదేశాలు చూపిస్తామని పక్క జిల్లాల జనాన్ని మభ్యపెట్టి ఆ సభకు తీసుకొచ్చారని నవ్య ఆరోపించారు. ప్రియాంక రోడ్ షోను ఏడాదికి ఒకసారి వచ్చే పండగలా చేశారంటూ విమర్శించారు.