ప్రకాశం: దోర్నాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ఓ యువకుడిపై దోర్నాలకు చెందిన మరో యువకుడు రాళ్లు, బీర్ సీసా బాటిల్తో దాడి చేశాడు. దీంతో ఒక యువకుడికి తలకు, పొట్ట భాగంలో గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.