రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా సైన్యం ఉక్రెయిన్‌లోకి వెళ్తుందనే వార్తలపై వైట్‌హౌస్ స్పందించింది. ఉత్తరకొరియా మద్దతు పొందితే అది రష్యా బలహీనతేనని తెలిపింది. ‘ఉక్రెయిన్‌తో యుద్ధానికి రష్యా ఒకవేళ ఉత్తరకొరియా సైనికులను రప్పిస్తే.. అది క్రెమ్లిన్ బలహీనతకు చిహ్నం అవుతుంది. యుద్ధ రంగంలో కిమ్ సైనికులు కచ్చితంగా ఉక్రెయిన్ లక్ష్యాలు అవుతారు’ అని వైట్‌హౌస్ NSC ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు.