TG: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచనున్నట్లు వస్తున్న వార్తలపై డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ స్పందించారు. ఈ మేరకు సామన్య ప్రజలపై ఛార్జీల భారం మోపడం లేదని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు విషయంలో తాము ఎలాంటి ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగించే గృహ విద్యుత్ వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదించామని ముషారఫ్ ఫరూఖీ పేర్కొన్నారు.