TG: అడ్డగోలు సాకులతో ఉద్యోగులను సస్పెండ్ చేశారని మాజీమంత్రి కేటీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో 165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్ల సస్పెండ్ దారుణమన్నారు. కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని.. అడ్డగోలు సాకులతో ఉద్యోగులను సస్పెండ్ చేశారని అన్నారు. హక్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.