TG: ధరణి పేరుతో ప్రభుత్వ ఖజానాను గత ప్రభుత్వం కొల్లగొట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అన్నారు. ‘విదేశీ కంపెనీలకు కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టారు. ధరణిని కేంద్రంలోని NICకి అప్పగిస్తున్నాం. కొత్త ROR-2024 చట్టాన్ని తీసుకువస్తున్నాం. దాన్ని డిసెంబర్ నుంచి అమలు చేస్తాం. 15 దేశాల్లోని రెవెన్యూ అంశాలను తీసుకుని డ్రాఫ్ట్ తయారు చేశాం. గత ప్రభుత్వాలు తమ తొత్తులకు ఇచ్చిన భూములను వెలికితీస్తాం’ అని పేర్కొన్నారు.