హీరో ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘సలార్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ సౌత్ భాషలతో పాటు ఇంగ్లీష్ భాషలో స్ట్రీమింగ్ అవుతుండగా.. హిందీ వెర్షన్ హాట్స్టార్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా హాట్స్టార్లో 250 రోజులు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో నిలిచి రికార్డు సాధించింది. నిన్న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడించారు.