ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి హెరిటేజ్ ఫుడ్స్ ఆదాయాలు ఆర్జించింది. ఏకీకృత ఖాతాల ప్రకారం ఆదాయం రూ.1019.5 కోట్లు, నికరలాభం రూ.48.6 కోట్లు. త్రైమాసిక EPS రూ.5.24గా ఉంది. 2023-24 ఇదేకాలంలో రూ.978.5 కోట్లు, నికరలాభం రూ.22.4 కోట్లు, EPS రూ.2.42గా ఉన్నాయి. దీంతో పోలిస్తే ఆదాయం 4.2శాతం, నికర లాభం 117 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం 6 నెలలకు రూ.2052.2 కోట్లు, నికరలాభం రూ.107.1 కోట్లు, EPS రూ.11.54గా ఉంది.