కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనేది ఉపశీర్షిక. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యష్.. ఈ మూవీ టైటిల్, ట్యాగ్‌లైన్ గురించి మాట్లాడారు. ప్రస్తుతం అందరూ విషపూరిత పరిస్థితుల్లో జీవిస్తున్నారని, ఈ సినిమా ద్వారా పెద్దలకు మెసేజ్ ఇవ్వాలనుకున్నామని తెలిపారు. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్, ట్యాగ్‌లైన్ పెట్టామని పేర్కొన్నారు.