ఉమ్మడి గుంటూరు జిల్లా అండర్-14 బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపికకు గురువారం పోటీలు నిర్వహిస్తున్నట్లు పీఈటీ షేక్ కరీముల్లా తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన జట్లు మాత్రమే పోటీలకు హాజరుకావాలన్నారు. తప్పనిసరిగా 2011 జనవరి ఒకటి తర్వాత జన్మించి ఉండాలన్నారు. పాఠశాల ఉపాధ్యాదాని ద్వారా వయసు ధ్రువీకరణపత్రం తీసుకొని కోఆర్డినేటర్ అనుమతితో రావాలన్నారు.