తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలకు వాతావరణశాఖ కృష్ణగిరి, తెంకాసి, తిరుపత్తూర్కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కోయంబత్తూరు, కాంచీపురం, తిరువణ్ణామలై సహా 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కోయంబత్తూర్, నీలగిరి జిల్లాల్లో భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీట మునిగాయి. కోయంబత్తూర్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉమ్మడి వేలూరు జిల్లాలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, విద్యుత్ సరఫరా నిలిపివేశారు.