అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. రెండు పార్టీల అభ్యర్థులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈనెల 29న కమలా హారిస్ ప్రచార ముగింపు సభ నిర్వహించనున్నారు. డొనాల్డ్ ట్రంప్ కంటే మెరుగ్గా పరిపాలించగలనని కమలా హారిస్ చివరి ప్రసంగం చేయనున్నారు. జనవరి 6న జరిగిన అల్లర్లకు ముందు ట్రంప్ ర్యాలీ నిర్వహించిన చోటే ఆమె వేదిక అని ప్రచార బృందం తెలిపింది.