హిట్లర్ మంచి పనులు చేశారని డొనాల్డ్ ట్రంప్ ఓ సందర్భంలో వ్యాఖ్యానించారని ఇదివరకు మాజీ మెరైన్ జనరల్ జాన్ కెల్లీ తెలిపారు. ఈ నేపథ్యంలో కమలా హారిస్.. ట్రంప్‌పై పదునైన విమర్శలు చేశారు. 60 లక్షల మంది యూదులను, వేలాది మంది అమెరికన్లను చంపిన వ్యక్తిని కీర్తించడం సరికాదంటూ మండిపడ్డారు. దీని ఆధారంగా ట్రంప్ వ్యక్తిత్వం ఎలాంటిదో అమెరికా ప్రజలు తెలుసుకోవాలని హారిస్ హితవు పలికారు.