భారత ఆర్థిక వ్యవస్థ శక్తిని ఎవరూ విస్మరించలేరని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోని ప్రతి ఆరుగురిలో ఒకరు భారతీయులే కాబట్టి.. భారత్ తన ప్రాభవాన్ని విస్తరించుకోవాలనుకుంటోందన్నారు. అమెరికా, చైనా దేశాలు భారత్‌ను విస్మరించలేవని స్పష్టం చేశారు. అమెరికాలో నిర్వహించిన ‘బ్రెట్టన్ వుడ్ సంస్థలు@80: తదుపరి దశాబ్ద ప్రాధాన్యతలు’ కార్యక్రమంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.