ASR: గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు, తమ పరిధిలోని గ్రామాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్పించాలని కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం ఎస్సై పీ.కిషోర్ వర్మతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో మండలంలోని అన్ని సచివాలయాల జీఎంఎస్కేలతో సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో మహిళలపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.