errabelli dayakar rao:కేటీఆర్ సీఎం, కేసీఆర్ పీఎం: ఎర్రబెల్లి దయాకర్ రావు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపడుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) తెలిపారు. తానే కాదు మిగతా నేతలు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టాలని అనుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల నుంచి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపట్టాలని కొందరు నేతలు కోరుతున్నారు.
errabelli dayakar rao:తెలంగాణ గట్టు మీద రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల వేడి సెగ తగులుతోంది. ప్రధాన పార్టీల నేతలు జనంతో కలిసిపోతున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయదుందుబి ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. మిగతా పార్టీలు తుడుచుకు పెట్టుకుపోతాయని అన్నారు. చెప్పని పనులు కూడా తమ ప్రభుత్వం చేసిందని అంటున్నారు. మిగతా పార్టీలకు జనాలను ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
మంత్రి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపడుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు (errabelli dayakar rao) తెలిపారు. తానే కాదు మిగతా నేతలు కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపట్టాలని అనుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు. చాలా రోజుల నుంచి కేటీఆర్ (ktr) సీఎం పదవీ చేపట్టాలని కొందరు నేతలు కోరుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ (shakeel) ఫస్ట్ ఉంటారు. ఆ తర్వాత ఒక్కో నేత.. మెల్లిగా స్వరం వినిపిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు చేరారు. అంతేకాదు సీఎం కేసీఆర్ (kcr) ప్రధానమంత్రి అవుతారని చెప్పారు.గుణాత్మక మార్పు కోసం ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పారు. కేసీఆర్ ప్రధాని కావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి (revanth reddy), బండి సంజయ్ (bandi sanjay) గురించి ప్రస్తావించారు. ఆ ఇద్దరు నేతలు ఏం చేసినా, చెప్పినా జనం వినరని తెలిపారు. పాదయాత్ర కాదు.. పొర్లు దండాల యాత్ర చేసినా ఫలితం ఉండదన్నారు. వారిని ప్రజలు విశ్వసించరని తెలిపారు. ఆ ఇద్దరు నేతలు తుపాకీ రాముడిని తలపిస్తున్నారని విమర్శించారు. రేవంత్ పాదయాత్ర చేపట్టగా.. బండి సంజయ్ ఇదివరకే పాదయాత్ర చేశారు. ఇటు చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి (ranjith reddy) కూడా ఎర్రబెల్లితో స్వరం కలిపారు. కేటీఆర్ సీఎం అని.. కేసీఆర్ ప్రధాని అవుతారని కామెంట్ చేశారు. తెలంగాణ అభివృద్ది దేశానికి ఆదర్శంగా నిలువనుందని పేర్కొన్నారు.
మరోవైపు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) ఇదే అంశంపై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడానికి గల కారణం.. కేటీఆర్‌ను సీఎం చేయడమేనని తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీకి తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని తెలిపారు. ఆస్తులు పెంచేందుకు తప్ప.. ప్రజా సంక్షేమం కోసం కేసీఆర్ పనిచేయడం లేదన్నారు.