KRNL: మహానంది మండలం తిమ్మాపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నంద్యాల జిల్లా డిఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ మంగళవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలని, శానిటేషన్ పై మరింత శ్రద్ధ చూపాలని తెలిపారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ బయోమెట్రిక్ విధానాన్ని అనుసరించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ భగవాన్దాస్, తదితరులు పాల్గొన్నారు.