కొరియన్ సిరీస్లకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. కొరియన్ సిరీస్ ‘హిడెన్ ఐడెంటిటీ’ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సదరు సంస్థ పోస్టర్ షేర్ చేసింది. మొత్తం 16 ఎపిసోడ్స్ నిడివితో మిస్టరీ థ్రిల్లర్గా తెరకెక్కింది. ఇందులో కిమ్ బమ్, పార్క్ సంగ్ ఊంగ్, యూన్ సో యి, లీ వాంగ్ జంగ్ కీలక పాత్రల్లో నటించారు.