కృష్ణ: నూజివీడు పట్టణంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాల ఆవరణములో ఈనెల 25వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ హబ్ ఏలూరు జిల్లా ఇన్చార్జి వాడపల్లి కిషోర్ మంగళవారం తెలిపారు. పదవ తరగతి నుండి పీజీ వరకు చదివిన అభ్యర్థులు 18 నుండి 30 ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. 8374039719,966632032 (9988853335) టోల్ ఫ్రీ నంబర్‌కు సంప్రదించవచ్చు అన్నారు.