తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది అయ్యప్ప భక్తులు ఏటా శబరిమలకు పోటెత్తుతారు. అయితే, వీరి కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా సికింద్రాబాద్ నుంచి శబరిమల యాత్ర కోసం ప్రత్యేక రైలు ఏర్పాటు చేసింది. ఈ యాత్ర నవంబర్ 16 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దక్షిణ మధ్య రైల్వే తాజాగా విడుదల చేసింది.