TG: రాష్ట్రంలో మార్కెట్ కమిటీల నియామకాలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాజాగా మరో 4 వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకం చేపట్టినట్లు చెప్పారు. నవాబ్‌పేట, భువనగిరి, వట్పల్లి, జోగిపేట మార్కెట్ కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. దీంతో ఇప్పటి వరకు 92 మార్కెట్ కమిటీల నియామకాలు జరిగాయని వెల్లడించారు.