పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపునారాయణపేటలో ఎమ్మెల్యే విజయరమణారావు చిత్రపటానికి శనివారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రేమ్ సాగర్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూపు నారాయణపేట నుంచి ఇందుర్తి వరకు రూ.2 కోట్ల నిధుల రోడ్డు నిర్మాణం మంజూరు కావడంతో పాలాభిషేకం నిర్వహించారు.