KDP: బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కొడవటికంటి రాజేష్ ఛత్తీస్‌ఘడ్‌లోని మిజాపూర్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP )లో జవాన్ గా పనిచేస్తున్నారు. శనివారం నక్షల్స్ అమర్చిన మైనింగ్ బాంబ్ పేలి మరణించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్తతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.