AP: విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం తగ్గుముఖం పట్టిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డయేరియాకు గురైన 201 మందిలో ప్రస్తుతం 41 మంది చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారు పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు. భూగర్భజలాలు కలుషితం కావడం వల్లనే అతిసారం ప్రబలినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. గుర్లలో సూపర్ క్లోరినేషన్ చేపట్టామని, బోర్లను పూర్తిగా మూసివేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని వెల్లడించారు.