విదేశాలకు వెళ్లాలనే మోజు ఈతరం విద్యార్థులను కొత్త రోగంలా పట్టుకుందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ మండిపడ్డారు. ‘ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు భారత విద్యార్థులు అమితాసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది 13 లక్షల మంది భారత విద్యార్థులు విదేశాలకు వెళ్లారు. ఫలితంగా రూ.50 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని మనం కోల్పోయాం. వారు ఇక్కడే చదువుకొని ఉంటే దేశానికి, వారికి చాలా రకాల ప్రయోజనం చేకూరి ఉండేది’ అని అభిప్రాయపడ్డారు.