కార్తీ, అరవింద్ స్వామి కీలక పాత్రలు పోషించిన మూవీ ‘సత్యం సుందరం’. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లు సాధించింది. త్వరలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అక్టోబర్ 25 నుంచి నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. కాగా సి.ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ మూవీలో బావ-బావ మరిదిగా కార్తీ, అరవింద్ స్వామి నటన అందరినీ ఆకట్టుకుంది.