»Tollywood Future Stars Are Akhira Nandan And Gautham Krishna
akhira and gautham:ఫ్యూచర్ స్టార్స్ వీళ్లే.. ప్రిక్స్ ఫోటోలు వైరల్
akhira and gautham:టాలీవుడ్‌ను ఏలేది టాప్ హీరోలు మారుతుంటారు. చిరు తర్వాత బాలయ్య (balakrishna), నాగార్జున (nagarjuna), వెంకటేష్ (venkatesh) పేర్లు కూడా వినిపిస్తాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ (pawan kalyan), మహేశ్ బాబు (mahesh babu), ప్రభాస్ (prabhas), తారక్ (ntr), రామ్ చరణ్ (ram charan) ఉంటారు. ఇప్పుడు పవన్ కుమారుడు అఖిరా, మహేశ్ కుమారుడు గౌతమ్ ఫ్యూచర్ స్టార్స్ అని ఫ్యాన్స్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.
akhira and gautham:టాలీవుడ్‌ను ఏలే టాప్ హీరోలు మారుతుంటారు. సీనియర్ ఎన్టీఆర్ (ntr), ఏఎన్ఆర్ (anr), కృష్ణ (krishna), కృష్ణంరాజు (krishnam raju) తర్వాత చిరంజీవిదే (chiranjeevi) టాప్ ప్లేస్. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కింగ్‌గా ఉంటున్నారు. సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వెళ్లినా.. తిరిగి మళ్లీ మొహానికి రంగు వేసుకుంటున్నారు. ఆడపా దడపా మూవీస్ చేస్తున్నారు. చిరు తర్వాత బాలయ్య (balakrishna), నాగార్జున (nagarjuna), వెంకటేష్ (venkatesh) పేర్లు కూడా వినిపిస్తాయి. ఆ తర్వాత పవన్ కల్యాణ్ (pawan kalyan), మహేశ్ బాబు (mahesh babu), ప్రభాస్ (prabhas), తారక్ (ntr), రామ్ చరణ్ (ram charan) ఉంటారు.
పవన్, మహేశ్, ప్రభాష్ తర్వాతి తరం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? స్టార్ హీరోల కుమారులు ఇండస్ట్రీలోకి వస్తే ఎలా ఉంటుందనే చర్చ జరుగుతుంది. అవును పవన్ కల్యాణ్ తనయుడు అఖిరానందన్ (akhira), మహేశ్ బాబు తనయుడు గౌతమ్ (gautham0 గురించి ఇప్పుడు చర్చ.. వీరిద్దరూ తర్వాత ఇండస్ట్రీని ఎళతారనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన రేసింగ్ (race) పోటీ వేడుకకు వీరిద్దరూ వచ్చారు. అప్పటినుంచి వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పవన్ (pawan), మహేశ్ (mahesh) ఫ్యాన్స్ వారి తనయుల ఫోటోలను షేర్ చేస్తున్నారు. వారు కచ్చితంగా హీరోలు కావాలని కోరుకుంటున్నారు. అఖిరా- గౌతమ్ పేరుతో ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. వీరు మంచి హైట్ ఉండటం.. ఫిజిక్ మెయింటెన్ చేయడంతో స్టార్స్ అయ్యేందుకు అవకాశం ఉంది. ఇక ఫ్యాన్స్ అయితే పూనకాలు వచ్చినట్టే చేస్తున్నారు. ఇప్పటినుంచే ఎంకరేజ్ చేస్తున్నారు.
గౌతమ్ చైల్ట్ ఆర్టిస్టుగా వన్.. నేనొక్కడినే (one) మూవీలో నటించాడు. ఆ సినిమాలో మంచి నటన కనబరిచాడు. తర్వాత స్టడీస్‌పై ఫోకస్ చేశాడు. అఖిరా కూడా ఇష్క్ వాలా లవ్ (ishq wala love) అనే మూవీలో చిన్న పాత్ర చేశాడు. తర్వాత ఎడ్యుకేషన్ మీద దృష్టిసారించారు. ఇప్పుడు వీరు టీనేజీకి రావడంతో సినిమాల్లోకి రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.