cm kcr on citizenship:పౌరసత్వం వదులుకోవడమా? ఇంతకన్నా దౌర్భగ్యం ఏముంది?
cm kcr on citizenship:దేశంలో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదని సీఎం కేసీఆర్ (cm kcr) అన్నారు. అందుకే విదేశాలపై (foreign) మోజు చూపిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు పొట్టకూటి కోసం వెళితే.. మరికొందరు మంచి లైఫ్ కోసం వెళుతున్నారని చెప్పారు. అమెరికా (america)లో పిల్లలకు గ్రీన్ కార్డు (green card) వస్తే ఇండియాలో (india) వారి పేరంట్స్ (parents) పండుగ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
cm kcr on citizenship:దేశంలో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదని సీఎం కేసీఆర్ (cm kcr) అన్నారు. అందుకే విదేశాలపై (foreign) మోజు చూపిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు పొట్టకూటి కోసం వెళితే.. మరికొందరు ఉన్నత ఉద్యోగం కోసం వెళుతున్నారని చెప్పారు. అమెరికా (america)లో పిల్లలకు గ్రీన్ కార్డు (green card) వస్తే ఇండియాలో (india) వారి పేరంట్స్ (parents) పండుగ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇతర దేశాలకు వెళ్లిన అదే పరిస్థితి అని చెప్పారు. గత 8 ఏళ్లలో 20 లక్షల మంది (20 lakhs) భారతీయ పౌరసత్వాన్ని వదులుకున్నారని చెప్పారు. దేశ పౌరసత్వం వదులుకునే దౌర్భగ్యం ఎందుకు అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ (kcr) తన పార్టీ (బీఆర్ఎస్) విస్తరించిన సంగతి తెలిసిందే. ఖమ్మంలో (kammam) తొలి బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత నాందెడ్‌లో (nanded) సభ నిర్వహించారు.
ఏపీ బీఆర్ఎస్ అధ్యక్ష బాధ్యతలను తోట చంద్రశేఖర్‌కు అప్పగించారు. తెలంగాణ శాఖను కూడా బీసీ నేతకు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. పొరుగున గల కర్ణాటకలో (karnataka) జేడీఎస్‌తో కేసీఆర్ సఖ్యంగా ఉన్నారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారడంతో.. జాతీయ భావాల గురించి కేసీఆర్ (kcr) మాట్లాడుతున్నారు. దేశం అభివృద్దిలో వెనకబడిపోయిందని చెబుతున్నారు. విద్య (education), వైద్యం (health) ఉచితంగా అందించాలని పదే పదే చెప్పేవారు. సాగునీటి కష్టాలు తప్పడం లేదని.. విద్యుత్ (power) సమస్య గురించి కూడా చెబుతున్నారు. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.
ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి (telangana assembly) ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్- మే నెలలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (andhra pradesh assembly) సహా పార్లమెంట్‌కు (parliament) ఎన్నిక జరగనుంది. ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. సీఎం కేసీఆర్ (kcr) కూడా సమయం దొరికినప్పుడల్లా పలు అంశాల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు దేశ పౌరసత్వం (citizenship) గురించి మాట్లాడారు. భారతదేశం ఉప ఖండం అని, దేశ పౌరసత్వం వదులుకోవడం మంచిది కాదని అంటున్నారు. భారతీయ సంస్కృతి, ఆచారాలను ప్రపంచం చూసి గర్వించేదని గుర్తుచేశారు. అలాంటి దేశం నుంచి సిటిజెన్ షిప్ వదులుకోవడమా? అని కేసీఆర్ సందేహాం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలన సరిగా లేదని 2014లో మోడీకి (modi) ఓటేశారు. దాంతో మన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. మోడీ గెలిచారు… బీజేపీ గెలిచింది… దేశ ప్రజలు ఓడిపోయారు. ప్రధానిగా మోడీ కంటే మన్మోహన్ సింగ్ (manmohan singh) ఎక్కువ పనిచేశారు. కానీ ఆయన ఎలాంటి ప్రచారాలు చేసుకోలేదని కేసీఆర్ వెల్లడించారు. దేశంలో పరిశ్రమలు మూతపడుతున్నాయని, ద్రవ్యోల్బణం పెరిగిపోతోందని కేసీఆర్ (kcr) ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో దేశం తీవ్రంగా నష్టపోయిందని, దేశం దివాళా తీసినా మాదే పైచేయి అంటున్నారని విమర్శించారు. పార్లమెంటులో తమను తామే పొగుడుకుంటున్నారని, జబ్బలు చరుచుకుంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని బీజేపీ నాయకత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్లకు చేరుతోందని మోడీ (modi) చెబుతున్నారు. 3.3 ట్రిలియన్లకు మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ చేరుకోగలిగింది. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అనేది పెద్ద జోక్ అని కేసీఆర్ అన్నారు. హిండెన్ బర్గ్ నివేదికపై మోడీ ఎందుకు మాట్లాడరు? ఈ అంశం దేశ ప్రతిష్ఠతను బాగా దెబ్బతీసింది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు భారత్‌ను నిశితంగా గమనిస్తున్నారు అని వివరించారు.