BDK: భద్రాచలం మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ‘ప్రజావాణి’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల మండల అధికారులు హాజరవుతారని, ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు సమర్పించాలని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.