రతన్ టాటా పార్థివదేహానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. కేంద్ర ప్రభుత్వం తరపున అంత్యక్రియలకు అమిత్ షా హాజరయ్యారు. అలాగే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ కూడా రతన్ టాటాకు నివాళులర్పించారు. మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ అంతకుముందు ముకేశ్ అంబానీ సంతాపం తెలిపిన విషయం తెలిసిందే.