Shah Rukh Khan : ఒక్క షారుఖ్ వాచ్ కొట్టేస్తే చాలు.. లైఫ్ సెట్ అయినట్టే!
Shah Rukh Khan : గతంలో ఏమో గానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. మన హీరోలు ధిరంచే వస్తువుల ధరలను ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్స్. హీరోల చేతిలో ఏది కొత్తగా కనబడినా.. వెంటనే దాని గురించి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలీవుడ్ బాద్షా లైఫ్ స్టైల్ రాయల్‌గా ఉంటుందని చెప్పొచ్చు.
గతంలో ఏమో గానీ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. మన హీరోలు ధిరంచే వస్తువుల ధరలను ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్స్. హీరోల చేతిలో ఏది కొత్తగా కనబడినా.. వెంటనే దాని గురించి ఆరా తీయడం మొదలు పెడుతున్నారు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల్లో బాలీవుడ్ బాద్షా లైఫ్ స్టైల్ రాయల్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఎంతలా అంటే.. ఆయన పెట్టుకున్న వాచ్ రేటు అక్షరాలా 5 కోట్లు అంటే.. షారుఖ్ మెయింటనెన్సన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు షారుఖ్. ఈ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. వెయ్యి కొట్ల మార్క్ చేరువలో ఉంది. దాంతో కింగ్ ఖాన్ సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడనే చెప్పాలి. ఇక ఈ సినిమా సక్సెస్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది చిత్ర యూనిట్. ఈ వేడుకలో షారుఖ్ ఖాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఆయనే కాదు.. ఆయన చేతికున్న వాచ్ ఇంకా హైలెట్‌గా నిలిచింది. బ్లాక్ సూట్లో దర్శనమిచ్చిన షారుఖ్.. చేతికి బ్లూ కలర్ రిస్ట్ వాచ్ పెట్టుకున్నారు. అది అక్కడున్న వారిని తెగ అట్రాక్ట్ చేసింది. దాంతో ఆ వాచ్ కథేంటో చూద్దామని గూగుల్‌లో సెర్చ్ చేశారు. ఇక గూగుల్ చెప్పిన కాస్ట్ చూసి షాక్ అవడం నెటిజన్స్ వంతైంది. ఈ వాచ్.. స్విడ్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ ‘అడెమర్స్ పిగెట్’ అనె కంపెనీది అని తెలిసింది. దీన్ని ‘రాయల్ ఓక్ పెర్పెచ్యుయల్ క్యాలెండర్ వాచ్’ అని అంటారు. దీని కాస్ట్ వచ్చేసి 4.98 కోట్లు.. అంటే దాదాపు 5 కోట్లు అన్న మాట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏదేమైనా.. ఒక్క షారుఖ్ వాచ్ కొట్టేస్తే చాలు.. లైఫ్ సెట్ అయినట్టేనని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.