యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో బడా బడా సంస్థలు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాయి. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా ఇంట్రీ ఇచ్చిన కిరణ్.. ఆ తర్వాత వెంటనే ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయాన్ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాతే రేసులో వెనకపబడిపోయాడు. సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని.. సినిమాలతో ఆకట్టుకోలేకపోయాడు. దాంతో కిరణ్ జడ్జ్మెంట్ ఇలా ఉందేంటి.. అనే డౌట్స్ వచ్చాయి. అయితే ఈసారి మాత్రం మనోడు హిట్ కొట్టేలానే ఉన్నాడు. ఫిబ్రవరి 17న వినరో భాగ్యము విష్ణుకథ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా.. రెగ్యులర్‌గా కాకుండా కొత్త కాన్సెప్ట్‌తో వస్తోంది. ఫోన్ నెంబర్ నైబర్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తోనే రాబోతున్నట్లు ట్రైలర్‌తో చెప్పేశారు. దాంతో ఈ సినిమా పై పాజిటివ్ వెబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. పైగా అల్లు అరవింద్ ఈ సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. అందుకే కిరణ్ బాబుకు హిట్ ఖాయమనేలా కనిపిస్తోంది. అందుకు తగ్గట్టే సెన్సార్ టాక్ కూడా పాజిటివ్‌గానే వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది.సెన్సార్ సభ్యుల నుంచి ఈ మూవీకి డీసెంట్ టాక్ వచ్చినట్లు తెలుస్తుంది. రన్ టైం కూడా డీసెంట్‌గా ఉంది. 138 నిమిషాలు అంటే.. రెండు గంటల 18 నిమిషాల రన్ టైం లాక్ చేశారట. దాంతో ముందు నుంచే వినరో భాగ్యము విష్ణుకథ హిట్ అనే టాక్ స్టార్ట్ అయింది. మరి కిరణ్ ఈ సినిమాతో హిట్ అందుకుంటాడేమో చూడాలి.