»Turkey Syria 24000 Victims Of The Earthquake Are Still Alive After 104 Hours
Turkey-Syria: భూకంప బాధిత మృతులు 24 వేలు..104 గంటల తర్వాత కూడా బతికేసింది
టర్కీ-సిరియాలో తీవ్ర భూకంపం సంభవించి 100 గంటల తర్వాత కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు ఇరు దేశాల్లో కలిపి 24 వేల మందికిపైగా మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది.
టర్కీ-సిరియా(turkey-syria)లో భారీ భూకంపం(Earthquake)సంభవించిన 100 గంటల తర్వాత కూడా ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు ఇరు దేశాల్లో కలిపి 24 వేల మంది మరణించినట్లు అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇది శతాబ్ద కాలంలో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటిగా నిలిచిందని అంటున్నారు. మరోవైపు భూకంపం కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగగా అనేక మంది ఆకలి బాధలతో నిరాశ్రయులు అవుతున్నట్లు చెబుతున్నారు. ఇంకొవైపు మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
అక్కడి శిథిలాల తొలగింపు ప్రక్రియలో భాగంగా కొన్ని ఆసక్తికర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. హటే ప్రావిన్స్‌లోని సమందాగ్ జిల్లాలో 90 గంటల తర్వాత కూడా తన తల్లితో పాటు 10 ఏళ్ల బాలుడు సజీవంగా ఉన్నట్లు గుర్తించి అధికారులు కాపాడారు. మరోవైపు అస్య డోన్మెజ్ అనే ఏడేళ్ల బాలికను 95 గంటల తర్వాత రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అక్కడి వార్త సంస్థ తెలిపింది. మరోవైపు భూకంపం సంభవించి 104 గంటల దాటినా కూడా శుక్రవారం రాత్రి శిథిలాల కింద ఓ మహిళ సజీవంగా ఉన్నట్లు సిబ్బంది గుర్తించి రక్షించారు. ఇది చూసిన అక్కడి స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టర్కీ-సిరియాలో సంభవించిన విపత్తు తరువాత నాలుగు రోజుల పాటు చలిలో చిక్కుకున్న తర్వాత కూడా శుక్రవారం 10 మందికిపైగా శిథిలాల నుంచి ప్రాణాలతో బయట పడినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ నేపథ్యంలో పలు చోట్ల కూలిపోయిన వేలాది భవనాల శిథిలాల్లో ఇంకా చాలా మంది వారి కుటుంబ సభ్యులు(family members) సజీవంగా కనిపిస్తారనే ఆశలు అక్కడి వారిలో చిగురిస్తున్నాయి.
Zeynep Kahraman had been trapped under a mountain of concrete for five days in Turkey after a deadly earthquake struck the region. Her sister and the teams of German and Turkish rescuers tell her story of survival https://t.co/QoemWG5wkTpic.twitter.com/CqYpQr3wQp
ఈ ప్రాంతాన్ని కుదిపేసిన వినాశకరమైన భూకంపం(earthquake )వల్ల సిరియా(syria)లో 5.3 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి అధికారి(uno officer) శుక్రవారం తెలిపారు. మరోవైపు దాదాపు ఒక మిలియన్ మందికి అత్యవసర ఆహారం(urgent food) అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే ఈ దేశాలకు సాయం చేసేందుకు భారత్(India)తో సహా పలు దేశాలు సహాయ సామగ్రిని పంపాయి. తాజాగా UN సహాయ ఏజన్సీ సిబ్బంది సిరియన్ పరిధిలోని మండలాలకు సాయం చేసుందుకు వచ్చారు.
ఈ నేపథ్యంలో పలు చోట్ల వచ్చిన చిన్న ప్రకంపనలకు కూడా భవనాల కూలిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆ భవనాలు కట్టిన కంట్రాక్టర్ల(building contractor) వివరాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నిస్తున్న కాంట్రాక్టర్‌ను టర్కీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి మీడియా తెలిపింది. మాంటెనెగ్రోకు పారిపోవడానికి ప్రయత్నించిన కాంట్రాక్టర్ మెహ్మెత్ యాసర్ కోస్కున్ను ఇస్తాంబుల్ విమానాశ్రయం(istanbul airport)లో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. అంతేకాదు అతను తనతోపాటు చాలా డబ్బును కూడా తీసుకువెళుతున్నాడని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో టర్కీ(turkey)లో పునర్నిర్మాణ ఖర్చులు 3 బిలియన్ నుంచి 5 బిలియన్ డాలర్లు అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని బ్లూమ్‌బెర్గ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థలు అంచనా వేశాయి.