దేశీయ దిగ్గజ సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. హోసూర్లోని కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్లో త్వరలో 20 వేల మందికిపైగా ఉద్యోగులను నియమించుకోనుంది. ఈ విషయాన్ని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. పనపాక్కంలో టాటా మోటార్స్- జేఎల్ఆర్ రూ.9,000 కోట్లతో నిర్మించనున్న కొత్త తయారీ యూనిట్ శంకుస్థాపనకు చంద్రశేఖరన్ హాజరై మాట్లాడారు.