TG: కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆయన సేవలను స్మరిస్తూ ట్వీట్ చేశారు. ‘క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సమరయోధుడు బాపూజీ. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పదవులను సైతం లెక్కచేయని త్యాగధనుడు. మలిదశ తెలంగాణ ఉద్యమ మార్గదర్శి.. బడుగు, బలహీనవర్గాల చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక ఆయన. కొండా లక్ష్మణ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నా నమస్సుమాంజలి’ అని పేర్కొన్నారు.