VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో గురువారం పునర్వసు నక్షత్రం సందర్బంగా శ్రీ సీతారాముల వారికి పంచామృత స్నపన పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చాణక్య,హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో వేకువజాము నుండి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు K. విక్రమార్క చక్రవర్తి, నారాయణం సీతారామయ్య, పద్మశ్రీ, భక్తులు పాల్గొన్నారు.