KDP: సింహాద్రిపురం మండలంలోని వై.కొత్తపల్లె గ్రామానికి చెందిన ఐదుగురు జూదరులను బుధవారం రాత్రి అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.5,820 స్వాధీనం చేసుకున్నామని ఎస్సై తులసి నాగప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే ప్రజలు తెలియపరిస్తే అలాంటి వాటిని అణచివేస్తామని, ఇందుకు ప్రజల సహకారాలు అందించాలని ఆయన కోరారు.