రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటిస్తోన్న మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఇవాళ సాయంత్రం 6:03 గంటలకు సెకండ్ సింగిల్‌పై మరో ట్రీట్ సిద్ధంగా ఉందంటూ థమన్ ట్వీట్ చేశారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి ‘రా మచ్చ మచ్చ’ అంటూ సాగే రెండో పాట ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.