అత్యాచారం కేసులో మలయాళ నటుడు ఇడవేలు బాబు అరెస్ట్ అయ్యారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాబు మూవీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో.. సభ్యత్వం నిమిత్తం కలూర్లోని ఆయన ఇంటికి వెళ్లగా.. తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఓ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.