ప్రముఖ సినీనటి ఊర్మిళ మతోంద్కర్ విడాకులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్తో వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు సమాచారం. ఈ మేరకు విడాకుల కోసం ముంబై కోర్టులో 4 నెలల క్రితం పిటిషన్ దాఖలు చేసినట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఊర్మిళ నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఎనిమిదేళ్ల క్రితం J&Kకు చెందిన వ్యాపారవేత్త, మోడల్ మోసిన్ను వివాహమాడారు.