VZM: చీపురుపల్లి, పుర్రేయవలస గ్రామంలో సర్పంచ్ సారిక మోహన్ రావు ఆధ్వర్యంలో మంగళవారం ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కళా వెంకటరావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్డీయే ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.