తిరుమల లడ్డూ కల్తీ వివాదంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటుంటే మీరు ఎందుకు సెటైర్లు వేస్తున్నారని ప్రశ్నించారు. స్పందిస్తే స్పందించండి.. లేదంటే మౌనంగా ఉండాలని సూచించారు. అంతేకానీ సనాతన ధర్మం గురించి అపహాస్యంగా మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. నిన్న ఓ ఆడియో ఫంక్షన్లో లడ్డూ గురించి చులకనగా మాట్లాడటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.