తమిళ హీరో కార్తీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఖైదీ’ 2019లో రిలీజై భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కొనసాగింపుగా ‘ఖైదీ 2’ రాబోతుంది. తాజాగా ఈ సినిమాపై కార్తీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సర్దార్ 2 షూటింగ్ జరుగుతోందని, ఖైదీ 2 వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లొచ్చని తెలిపాడు. అలాగే త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని పేర్కొన్నాడు.