తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సత్యం సుందరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ సందడి చేశారు. ‘దేవర’ ప్రీ రిలీజ్ వేడుక రద్దయినందుకు బాధపడొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న ‘దేవర’ రిలీజ్ కానుంది. ఆ సినిమాతో పాటు ఈ నెల 28న విడుదల కానున్న ‘సత్యం సుందరం’ మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. కాగా, విశ్వక్.. ఎన్టీఆర్కు అభిమాని అన్న విషయం తెలిసిందే.