భారత్లో తొలి ‘క్లేడ్ 1’ మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళకు చెందిన యువకుడికి ఇది నిర్ధారణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మలప్పురానికి చెందిన ఆ యువకుడు UAE నుంచి వచ్చినట్లు గుర్తించారు. క్లేడ్ 1 వ్యాప్తితోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆరోగ్య ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే.