AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా నెలల గ్యాప్ తర్వాత తన సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం మొదలుపెట్టారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయం సమీపంలోని హరిహర వీరమల్లు సినిమా యూనిట్ మూవీ సెట్ వేసింది. దీంతో ఇవాళ ఉదయం నుంచి ఈ మూవీ షూటింగ్లో పవన్ పాల్గొన్నారు. ఈ షెడ్యూల్లో పవన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. కాగా ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.