AP: సచివాలయంలో న్యాయశాఖపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే 100 ఎకరాల్లో అమరావతిలో న్యాయ కళాశాల ఏర్పాటుకు ప్రతిపాదన చేశారు. ఇక జూనియర్ న్యాయవాదులకు రూ.10వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. న్యాయస్థానాల్లో నిందితులకు శిక్షపడేలా న్యాయవాదుల విచారణ ఉండాలని సీఎం సూచించారు.