తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు దేవర ప్రమోషన్స్‌కు సంబంధించి ప్రెస్‌మీట్ కానీ, ఈవెంట్ కానీ జరగలేదు. ఆదివారం జరగాల్సిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయింది. ఇవాళ ఉదయం NTR అమెరికాకు వెళ్లిపోయారు. లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ ‘బియాండ్ ఫెస్ట్ 2024’లో దేవర మొదటి షో ప్రదర్శనను వీక్షించనున్నారు. దీంతో దేవర ప్రమోషన్స్ లేనట్టే అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.