NLG: సీఎం సహాయ నిధి పేదలకు వరమని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని చాడ కిషన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో 20 మంది లబ్ధిదారులకు రూ.18,76,000 విలువ గల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు లతీఫ్, వెంకటేశ్వర్లు, శంకర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.