MDK: జిల్లా కలెక్టరేట్‌తో పాటు తహశీల్దార్ కార్యాలయంలో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు నేరుగా స్వీకరిస్తామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.